ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీవ్ర కోమాలోకి వెళ్లారని, వెంటిలేటర్ పై ఉన్నారని ఆర్మీ రిసెర్చి అండ్ రెఫరల్ హాస్పిటల్ మెడికల్ బులెటిన్ విడుదల చేసింది. మెదడుకు శస్త్ర చికిత్స చేసిన తరువాత 16 రోజులుగా ప్రణబ్ చికిత్స పొందుతున్నారు.
ఉపిరితిత్తుల్లో సమస్య ఉండడంతో చికిత్స చేస్తున్నామని, ఆయన మూత్రపిండాలు రోజురోజుకు క్షీణిస్తున్నాయని డాక్టర్ తెలిపారు. ఆ నెల 10వ తేదీన అత్యవసర చికిత్స చేసిన తరువాత వచ్చిన రిపోర్టుల్లో కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ఆ రోజు కోమాలోకి వెళ్లిన ఆయన ఇప్పటి వరకు కోలుకోలేదు.