పొలిటికల్ ఐ సెప్టెంబర్ 9 : ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బాలమురి వెంకట్ రావు ని పోలీసులు అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఎంసెట్ పరీక్షలు రాయనున్న విద్యార్థులకు మాస్క్ , శానిటైజర్ అందించడానికి సెంటర్ దగ్గరికి వెళ్లిన వెంకట్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.బుధవారం ఎంసెట్ ఎంట్రన్స్ పరీక్ష ఉన్న నేపథ్యంలో వెంకట్ మాస్క్ లు, శానిటైజర్లు అందించడానికి వెళ్ళారు. అసెంబ్లీ ముట్టడికి కాల్ ఇచ్చారనే సాకుతో అదుపులోకి తీసుకిన్నారని వెంకట్ తెలిపారు. ప్రభుత్వం విద్యార్థులకు జాగ్రత్త కోసం మాస్క్ లు,శాని టైజర్ ఇవ్వలేదు ఇచ్చేవారిని అడ్డుకుంటుందని వెంకట్ మండిపడ్డారు.