Politicla Eye

‘పోలీసులే 30 మంది రైతులను నిర్భందించారు’

నల్లగొండ: ఓ భూ వివాదంలో పోలీసులు 30 మంది రైతులను అదుపులోకి తీసుకుని విచారణ పేరుతో గత మూడు రోజులుగా హింసిస్తున్నారని బాధిత కుటుంబ సభ్యుల ఆరోపిస్తున్నారు. వివరాల్లోకెళితే.. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం, దామర భీమనపల్లిలో ఓ భూవివాదంలో 30 మంది దళిత రైతులను పోలీసులు అదుపులోకి తీసుకుని జిల్లా హెడ్ క్వార్టర్ లోని పోలీస్ ఆడిటోరియంలో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్నారని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు.

అదుపులోకి తీసుకున్న తమ వారి గురించి అడిగితే పోలీసుల పొంతన లేని సమాధానం చెబుతున్నట్టు తెలిపారు. మద్రాస్ హై కోర్ట్ స్టేటస్ కో ఇచ్చిన భూ వివాదంలో పోలీసులు తల దూర్చి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్నారు. ఆ 30 మంది రైతులను, భూ కేర్ టేకర్స్ ను వెంటనే అప్పజెప్పాలని, లేదంటే హైకోర్టును ఆశ్రయిస్తామంటూ హెచ్చరించారు. 378 ఎకరాల భూ వివాదంలో తెలంగాణ, ఆంద్రప్రదేశ్, తమిళనాడు పెద్దల హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వివాదంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత, అక్కినేని నాగార్జున కుటుంబంతో పాటూ మాక్స్ వర్త్ మరియు ఇతర తొమ్మిది కంపెనీలు ఉన్నట్టు తెలుస్తోంది.

వివాద భూమి వద్ద రాత్రికి రాత్రే అక్రమంగా మాక్స్ వర్త్ కంపెనీ పేరుతో బోర్డులు ఏర్పాటు చేసిందని దానికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారంటూ మిగతా తొమ్మిది కంపెనీలు ఆరోపిస్తున్నాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like