ఢిల్లీ: గుంటూరు జిల్లా ఆత్మకూరులో టీడీపీ కార్యాలయం కోసం నిబంధనలు ఉల్లంఘించి భూమిని కేటాయించారంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆ భూకేటాయింపును రద్దు చేసి, కూల్చివేతకు ఆదేశించాలని గతంలో ఏపీ హైకోర్టులో వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఇదే భవనంపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున న్యాయవాది అల్లంకి రమేశ్ వాదించనున్నారు. 99 ఏళ్ల పాటు లీజు ప్రతిపదికన ఆత్మకూరులో టీడీపీకి 3.65 ఎకరాల భూమిని కేటాయిస్తూ 2017 జూన్ 22న రాష్ట్ర ప్రభుత్వం జీఓ 228 జారీ చేసిందని పిటీషన్ లో తెలిపారు.
చట్ట ప్రకారం వాగు పక్కన ఉన్న భూమిలో భవన నిర్మాణాలు నిషేధమని.. సీఆర్డీఏ చట్టాన్ని కూడా ఉల్లఘించారని పేర్కొన్నారు.