అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 10,621 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి.
ఇదే సమయంలో 92 మంది మృత్యువాత పడ్డారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,90,195 కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 3,633 కి చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 34,79,990 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు తెలుస్తోంది.