హైదరాబాద్: గణేష్ నిమజ్జనం కోసం సన్నద్ధమవుతున్న హై రీచ్ బ్రాడ్ బ్యాండ్ సిబ్బంది పై ఆర్మీ మాజీ జవన్ గాల్లోకి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. రెండు రౌండ్లు కాల్పులు జరపగా ఒక గాల్లోకి వెళ్లగా, మరోటి పక్కనే ఉన్న వ్యక్తి చెవి పక్కనుంచి దూసుకెళ్లింది.
గురువారం రాత్రి హైదర్షా కోట్ లోని శివం ఎలైట్ హైట్స్ లోని తమ అపార్ట్ మెంట్ మొదటి అంతస్తులో హై రీచ్ ఇంటర్నెట్ సిబ్బంది గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొందరు సిబ్బంది మందు పార్టీ చేసుకుంటున్నారు. సుమారు 40 మంది సిబ్బంది కిందికి, పైకి వెళ్తూ అల్లరి అల్లరి చేశారు. ఈ విషయాన్ని భరించలేకపోయిన ఆర్మీ జవాన్ గొడవ చేయొద్దని చెప్పాడు. పలుమార్లు చెప్పినా కూడా ఇంటర్నెట్ సిబ్బంది పట్టించుకోలేదు.
దీంతో విసుగు చెందిన ఆర్మీ జవాన్ తొలిసారి గాల్లోకి కాల్పులు జరిపాడు. అందరూ వచ్చి సెల్లర్ లో డ్యాన్సులు చేస్తూ అరుస్తుండడంతో మరో సారి గాల్లోకి ఫైర్ చేశాడు. ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నార్సింగ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.