హైదరాబాద్: సినిమా డైరెక్టర్ శంకర్‌కు భూమి కేటాయింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. రూ.2.5 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రూ.25 లక్షలకు ఎలా కేటాయిస్తారని హైకోర్టు ప్రశ్నించింది.
తెలంగాణ ఉద్యమంలో శంకర్.. కీలకపాత్ర పోషించారని అడ్వకేట్ జనరల్ ప్రసాద్ తెలిపారు. తెలంగాణ కోసం త్యాగం చేసిన వేలమందికి ఇలాగే ఇస్తారా? అని హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వమే సొంతంగా సినిమా స్టూడియో నిర్మించవచ్చు కదా అని సూచించింది. ప్రభుత్వ భూములను సినీ పరిశ్రమ ఆక్రమించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఇలా భూములను కేటాయించి ప్రభుత్వం తప్పుడు సంకేతాలు ఇవ్వరాదని పేర్కొంది.
రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయాలకు సహేతుకత ఉండాలని హైకోర్టు వ్యాఖ్యనించింది. కౌంటర్ దాఖలుకు రెండు వారాల గడువు కోరగా అనుమతిస్తూ, విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.