ముంబై: హెచ్ఎండీ గ్లోబల్ కంపెనీ ఒకేసారి నాలుగు నోకియా స్మార్ట్ ఫోన్లను భారత విపణిలోకి విడుదల చేసింది. దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని ఈ మోడళ్లను విడుదల చేసినట్లు ప్రకటించింది.
సెప్టెంబర్ 17వ తేదీ నుంచి మార్కెట్ లో అందుబాటులోకి రానున్నాయి. నోకియా 5.3 లో రెండు మోడళ్లు, నోకియా సీ3 లో రెండు మోడళ్ల వివరాలు, ధరలు ఇలా ఉన్నాయి.
నోకియా 5.3 ఫీచర్లు…
6.55 అంగుళాల హెచ్.డీ డిస్ ప్లే
5.3 స్నాప్ డ్రాన్ 665 చిప్ సెట్
4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ (ధర రూ.13,999)
6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ (ధర రూ.15,999)
13+5+2+2 మెగా ఫిక్సెల్ రియర్ ట్రిఫుల్ క్యామ్
8 మెగా ఫిక్సెల్ సెల్పీ క్యామ్
4000 ఎంఏహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ
ఈ ఫోన్ కొనుగోలుపై రూ.2వేల క్యాష్ బ్యాక్ ఆఫర్, రూ.2వేల విలువైన వోచర్లను ఇవ్వనున్నారు.
నోకియా సీ3 ఫీచర్లు…
5.99 అంగుళాల డిస్ ప్లే
720*1600 ఫిక్సెల్ రిజల్యూషన్, ఆండ్రాయిడ్ 10
2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజీ (ధర రూ.7,499)
3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజీ (ధర రూ.8,999)
3.5 మి.మీ ఆడియో జాక్, ఎఫ్ఎం రేడియో
5 మెగా ఫిక్సెల్ సెల్పీ క్యామ్
3040 ఎంఏహెచ్ బ్యాటరీ.