హైదరాబాద్: బిగ్ బాస్-4 కంటెస్టెంట్లలో ఒకరైన సింగర్ నోయల్ కు కరోనా పాజిటివ్ వచ్చిందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈయనతో పాటు మరొకరికి పాజిటివ్ నిర్థారణ కావడంతో కొద్ది రోజులు వాయిదా పడుతుందనే వార్తలు గుప్పుముంటున్నాయి.
ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెలాఖరులో బిగ్ బాస్-4 సీజన్ హీరో నాగార్జున హస్టుగా ప్రారంభం కావాల్సి ఉంది. రెండు రోజుల క్రితం కంటెస్టెంట్లలో ఇద్దరికి పాజిటివ్ తేలిందనే విషయం బయటకు వచ్చింది. దీని గురించి సింగర్ నోయల్ ను ఒక మీడియా ప్రతినిధి సంప్రదించగా… అవన్నీ పుకార్లు అంటూ కొట్టి పారేశాడు. దీని గురించి తరువాత మాట్లాడదామంటూ ముగించాడు.
ఆయన స్పందించిన తీరును గమనించిన అభిమానులు… బిగ్ బాస్ లో ప్రవేశం లభించడం మూలంగా మౌనంగా ఉన్నాడా, లభించక టెన్షన్ లో ఉన్నాడా అనేది ఆందోళనకు గురువుతున్నారు.