Politicla Eye

నా బయోపిక్ నుండి తప్పుకో.. లేదంటే… : మురళీధరన్

పొలిటికల్ ఐ: ముత్తయ్య మురళీధరన్ క్రికెట్ ప్రియులకు పరిచయం అక్కరలేని పేరు. క్రికెట్ చరిత్రలోనే 800 వికెట్లు తీసి తనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించుకున్న క్రికెటర్.
ఈ క్రికెటర్ పై బయోపిక్ తీయబోతున్నట్టు ఒక నిర్మాణ సంస్థ ప్రకటించింది. ముత్తయ్యగా విజయ్ సేతుపతి నటించబోతున్నట్టు తెలిపాయి. ఇక్కడే అసలు రాజకీయాలు మొదలయ్యాయి. విజయ్ సేతుపతిని ఈ సినిమా నుండి తప్పుకోమని కొన్ని వర్గాల నుండి ఒత్తిడి మొదలయింది. గ్రేట్ డైరెక్టర్ అయిన భారతి రాజా లాంటి వాళ్ళు కూడా ఈ సినిమాకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఈ సినిమాని విజయ్ చేయటం సరి కాదని ఒక ద్రోహి అయిన ముత్తయ్య సినిమాని చేయకూడదంటూ మాట్లాడారు. దీనికి మరొక వర్గం నుండి విజయ్ సేతుపతికి బలం లభించింది. రాధిక మరియు శరత్ కుమార్ లు సినిమాని సినిమాగానే చూడాలని ఎలాంటి సినిమాలు తీయాలి అనేది రాజకీయాలు నిర్నియించకూడదు అంటూ ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా ముత్తయ్య ఒక లేఖని విడుదల చేసారు. ” తను కూడా తమిళ వాడిని అని నేను తమిళ్ మాట్లాడగలనని నేను 7 సంవత్సరాలు ఉన్నప్పుడే తేయాకు కంపెనీలో పని చేయుటకు శ్రీలంక కి వెళ్ళమని, అక్కడ తన తండ్రి ని చంపేసారని, తను 2009 లో మాట్లాడిన మాటలని వక్రీకరించారని తెలిపారు.
శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం పోరాడిన ఎల్టీటీఈ ప్రభాకరన్ ని అక్కడి మిలిటరీ ఎంకౌంటర్ చేసినప్పుడు తనకి ఎంతగానో శుభదినం ఇప్పుడు శ్రీలంక ఎంతో ప్రశాంతంగా ఉంటుందని ముత్తయ్య వ్యాక్యలు చేయటంతో ముత్తయ్యని ద్రోహిగా ప్రకటించారు తమిళనాడులో. అందుకోసమే ముత్తయ్య బయోపిక్ నుండి తప్పుకోవాలంటూ విజయ్ సేతుపతికి బాహాటంగానే వార్నింగ్ ఇస్తున్నట్టు తెలుస్తుంది.
ఈ సందర్భంగా విజయ్ సేతుపతికి మురళీధరన్ ఒక లేఖ రాశారు అందులో ” నువ్వు ఈ సినిమా నుండి తప్పుకోవాలని కోరుతున్నాను. లేకపోతే రాజకీయంగా నిన్ను ఇబ్బందులకు గురి చేస్తారు. నాకు ఇలాంటి అవమానాలు కొత్తేమి కాదంటూ తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like