హైదరాబాద్: మదురానగర్ శివారెడ్డి స్వీట్ షాప్ లో హత్య జరిగింది. సహచర ఉద్యోగి శ్రీనివాస్ ను మరో ఉద్యోగి గౌస్ దారుణంగా హత్య చేశాడు.
కొద్ది రోజులుగా ఒక మహిళ కోసం ఇద్దరి మద్య గొడవలు జరుగుతున్నాయి. తనకంటే తనకే చెందాలని ఇద్దరు వాదులాడుకుంటున్నారు.
మృతుడు శ్రీనివాస్ స్వస్థలం భద్రాద్రి కొత్త గూడెం జిల్లా రామవరం. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే మహిళ ముందే ఇద్దరు కొట్లాడుకున్నారు. మాటా మాటా పెరగడంతో గౌస్ శ్రీనివాస్ మొహం, తలపై పిడిగుద్దులు గుద్దాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ అక్కడే పడిపోయి మృతి చెందాడు. ఎస్సార్ నగర్ పీఎస్ లో కేసు నమోదు అయ్యింది.