గుంటూరు: లక్ష్మీపురంలోని కమలేష్ అపార్ట్ మెంట్ పైనుంచి తల్లీ, బిడ్డలు దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికులను కలచివేసింది. ఇవాళ 5 అంతస్తుల భవనం పైనుంచి బిడ్డను కిందకు వేసి, తల్లి మనోఙ్ఞ దూకింది.
ఈఘటన స్థలంలోనే 9 నెలల చిన్నారి తులసి మృతి చెందింది. కొన ఊపిరితో ఉన్న తల్లి మనోఙ్ఞ ( 29)ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. మనోఙ్ఞ దంపతులు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా దంపతులు గుంటూరు వచ్చారు. పట్టాభిపురం పోలీసులు అనుమానాస్పద మృతి గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలు నేపథ్యంలో ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు ప్రాధమిక అంచనాకు వచ్చారు.