హైదరాబాద్: మమ్మీ కల ఇన్నాళ్లకు నెరవేరిందంటూ హీరో రామ్ చరణ్ తేజ ఆనందం వ్యక్తం చేశాడు. నాన్న చిరంజీవి, నేను కలిసి స్ర్కీన్ పై కన్పించి కనువిందు చేయాలనేది అమ్మ కల అని, అది ఆచార్య చిత్రంతో సాకారమవుతుందని తెలిపాడు.
కోరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ఆచార్య చిత్రం లో నటిస్తున్న విషయం తెలిసిందే. కొణిదెల బ్యానర్ పై నటిస్తుతన్న ఈ చిత్రానికి రామ్ చరణ్ కో ప్రొడ్యూసర్ గా ఉన్నాడు. దీంతో పాటు ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు కూడా. ఈ విషయాన్ని రామ్ చరణ్ వెల్లడించారు. నాన్న ప్రజాధరణ, పేరు వల్లే తనకు ఈ స్టార్ డమ్ వచ్చిందన్నారు. నాన్నతో కలిసి నటించే అవకాశం వచ్చిందని, తనకు అంతకన్నా ఏం కావాలని.. మారు మాట్లాడకుండా ఒప్పేసుకున్నాని తెలిపాడు. ఇంతకు ముందు నేను నటించిన బ్రూస్ లీ చిత్రంలో నాన్న గెస్టు రోల్ చేయగా, ఖైదీ నెంబర్ 150లో కలిసి డ్యాన్స్ చేశానని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు.