Politicla Eye

ఎమ్మెల్యే అంబటి మైనింగ్ పై విచారణకు ఆదేశం

అమరావతి: ఎమ్మెల్యే అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైకోర్టు న్యాయవాది ఎం.నాగ రఘు పిటిషన్ దాఖలు చేశారు. రాజుపాలెం వైసీపీ కార్యకర్తల తరపున ప్రజా ప్రయోజవ్యాజ్యం వేశారు.

రాజుపాలెం మండలం కోట నెమలిపురి, కొండమోడులో అక్రమ మైనింగ్ జరిగిందని పిటిషన్ లో తెలిపారు. హైకోర్టు కేసు విచారణ వచ్చే నెలకు వాయిదా వేసింది. జిల్లా కలెక్టర్, మైనింగ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, సీఎం జగన్కుద పిటిషన్లు పంపినా పట్టించుకోలేదని తెలిపారు. ఇప్పటికే మైనింగ్ అధికారులు విచారణ జరిపారని పిటిషనర్లు పేర్కొన్నారు. వైసీపీ కార్యకర్తలు వేస్తే ప్రజాప్రయోజన వ్యాజ్యం ఎలా అవుతుందన్న హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టుకు పూర్తి వివరాలు చెప్పాల్సిన భాధ్యత తనపై ఉందని న్యాయవాది నాగ రఘు తెలిపారు. మంత్రి పెద్దిరెడ్డి విచారణ జరపాలని ఆదేశించినా పట్టించుకోలేదన్న తెలిపారు. అక్రమ మైనింగ్పైు వెంటనే నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది

Get real time updates directly on you device, subscribe now.

You might also like