ఏసీబీ వలలో చిక్కిన మెదక్ అదనపు కలెక్టర్ నగేష్
* కీసర మండల మాజీ ఎమ్మార్వో నాగరాజు 1కోటి 10 లక్షల అవినితి వ్యవహారం మరవాకముందే మరో అవినితి చేప ఏసీబీ కి చిక్కింది..
*మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ 1కోటి 12 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కారు.
*కలెక్టర్ తో సహా 12మంది ఇంట్లో సోదాలు…
* ఆడియో టేపులతో సహా ఏసీబీ కి చిక్కిన మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్
*112 ఎకరాలకు గాను ఎకరానికి 1 లక్ష లంచం డీల్ 2g
* అదనపు కలెక్టర్ తో సహా ఎమ్మార్వో, డీఆర్వో
పొలిటికల్ ఐ సెప్టెంబర్ 9: మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ ఏసీబీ వలలో చిక్కుకున్నారు. 40 లక్షలు లంచం తీసుకుంటూ ఎసిబి కి పట్టుబడ్డారు.ఒక భూవివాదం లో కోటి 12 లక్షల డీల్ చేసుకున్నట్లు సమాచారం.దింట్లో ముందుగా 40 లక్షల అడ్వాన్స్ మొత్తం ఈ వ్యవహారం కింద 1కోటి 12 లక్షల లంచం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఐతే లంచం గా కోటి 12 లక్షల డబ్బు తోపాటు కోటి రూపాయల ప్రాపర్టీ ని రాయించుకున్నట్లు సమాచారం .నర్సాపూర్ మండలం లోని తిప్పాల్ తుర్తి గ గ్రామం లో 112 ఎకరాలకు గాను వారికి NOC సర్టిఫికెట్ అవసరం ఉంది దింతో ఎకరానికి ఒక లక్ష రూపాయలు ఇస్తే NOC ఇవ్వడానికి డీల్ కుదిరించుకున్నట్లు సమాచారం అందింది దింతో వారెంట్ తీసుకొని సోదా చేస్తున్నట్లు ఏసీబీ అధికారాలు తెలిపారు.ప్రస్తుతం ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఏసీబీ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు.