న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ లోనే అత్యల్ప కరోనా మరణాల రేటు ఉందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు.
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకి తీవ్రంగా పెరిగిపోతున్న తరుణంలో మధ్యప్రదేశ్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో పలు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 1.82 శాతంగా ఉందని తెలిపారు. అయినప్పటికీ ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని సూచించారు.