డబ్లిన్: ప్రముఖ ఐటీ కంపెనీ యాక్సెంచర్ మొత్తం ఉద్యోగుల్లో 5 శాతం మందిపై వేటు వేసింది. అంటే 25 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించింది.
ప్రపంచ వ్యాప్తంగా ఈ కంపెనీకి 5.13 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే ఈ తొలగింపులో మన దేశానికి చెందిన వారు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. పనితీరు ఆధారంగా ఉద్యోగుల తొలగింపు ఉంటుందని, ఆశించిన ఫలితాలు కనబర్చని ఉద్యోగులను పంపిస్తున్నట్లు కంపెనీ సీఈఓ జూలీ స్వీట్ తెలిపారు.