Politicla Eye

హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ రేసులో కూన శ్రీశైలం గౌడ్

హైదరాబాద్,రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ ఎమ్మెల్యే, మేడ్చల్ జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ కూన శ్రీ‌శైలం గౌడ్‌ బరిలో దిగనున్నారు. ఇటీవల టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి తనకు అవకాశం కల్పించాలని కోరారు.

హైద‌రాబాద్‌,ఉమ్మ‌డి రంగారెడ్డి,మహబూబ్ నగర్ జిల్లాల్లో కూన శ్రీ‌శైలం గౌడ్ కు మంచి ప‌ట్టుండ‌టంతో ఈసారి ఎమ్మెల్సీగా శాస‌నమండ‌లిలో అడుగు పెట్టాల‌ని ఆయ‌న భావిస్తున్నట్లు తెలుస్తోంది. వ‌చ్చే ఏడాది మార్చ్ లో జ‌రిగే హైద‌రాబాద్‌, రంగారెడ్డి, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాల‌ ప‌ట్ట‌భ‌ద్రుల స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ప్ర‌స్తుతం ఈ స్థానం నుంచి ఎమ్మెల్సీ రాంచంద‌ర్ రావు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. వ‌చ్చే ఏడాది మార్చితో ఆయ‌న ప‌ద‌వీకాలం ముగుస్తోంది. దీంతో ఈసారి ఆ స్థానం నుంచి తాను పోటీ చేయాల‌ని కూన శ్రీ‌శైలం గౌడ్‌ యోచిస్తున్నారు. ఇందుకోసం ఆయ‌న గత ఆరునెలలుగా క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ…కాంగ్రెస్ పార్టినుండి ఎమ్మెల్సీ టికెట్ త‌న‌కే ఇవ్వాల‌ని ఏఐసిసి నేతలతో పాటు టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి,సిఎల్పి నేత భ‌ట్టి విక్ర‌మార్క‌, శ్రీధర్ బాబు,మాజీ ఎంపీలు వి.హ‌నుమంత‌రావు, మ‌ధుయాష్కీ గౌడ్‌,మ‌ల్లు ర‌వి, పోన్నం ప్ర‌భాక‌ర్‌,కొండ విశ్వేశ‌ర్ రెడ్డి, మాజీ మంత్రి దామేద‌ర రాజ‌న‌ర్సింహా, గడ్డం ప్రసాద్, పార్టీలోని ప‌లువురు సీనియ‌ర్ల‌ను సంప్రదించారు.

గత 30 ఏండ్లుగా కార్మి‌కుల స‌మ‌స్య‌ల‌పై రాజీలేని పోరాటంతో ప్రారంభ‌మైన తన ప్ర‌స్థానం.. రాష్ట్ర రాజకీయాల్లో తనదయిన శైలితో మెద‌ట ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా యువ‌జ‌న కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా, ఆంధ్ర‌ప్ర‌దేశ్ యువ‌జ‌న కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా, ఉమ్మ‌డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కార్పోరేష‌న్ చైర్మ‌న్ గా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి స్వ‌తంత్రంగా ఎమ్మేల్యేగా గెలిచి ఘ‌న విజ‌యం సాధించి చ‌రిత్ర సృష్టించారు కూన శ్రీశైలం గౌడ్. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తనకు మంచి పట్టున్నందున బీసీ వర్గానికి చెందిన తనకు పోటీచేసేందుకు అవకాశం ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like