అమరావతి: కడప జిల్లాకు చెందిన అంబటి కృష్ణారెడ్డిని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు.
కృష్ణారెడ్డికి కాబినెట్ ర్యాంక్ హోదా కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సలహాదారుల నియామకం మాత్రం ఆగడం లేదు. ఒకరు రాజీనామా చేసినా మరొకరని నియమించుకుంటూ వెళ్తున్నారు. మంత్రులు, అధికారులు ఉండగా వీరి అవసరం ఏముందనే విమర్శలు ఉన్నా పట్టించుకోవడం లేదు.