గత కొంత కాలంగా కనిపించకుండా పోయిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ పై మరో మారు ప్రపంచ వ్యాప్తంగా చర్చ మొదలైంది. కిమ్ చనిపోయారని, ఇక కిమ్ బాధ్యతలు తన సోదరే చూసుకుంటోందని చర్చ సాగుతున్న తరుణంలో మరో మారు ఆ దేశం స్పందించింది.
తమ అధ్యక్షుడు బతికే ఉన్నాడంటూ.. ఓ ఫొటోను విడుదల చేసింది. అయితే గతంలో కూడా కిమ్ కనిపించకుండా పోయిన సమయంలో కిమ్ ఉన్నాడంటూ.. ఓ వీడియోను విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన ఫొటోలో కిమ్ ఓ చర్చలో పాల్గొన్నట్టుగా ఉంది. ఇది ఎంతవరకు నిజమనేది ప్రశ్నార్థకంగానే మిగిలిపోతోంది.