Politicla Eye

వారెవ్వా.. గిన్నీస్ రికార్డులోకి కీసర తహసీల్దార్!

హైదరాబాద్: రూ.2 కోట్ల డీల్ మాట్లాడుకుని, రూ.1.10 కోట్లు లంచం తీసుకుంటూ పట్టుబడిన కీసర తహశీల్దార్ ఎర్వ బాలరాజు నాగరాజు పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి చేరే అవకాశాలు ఫుష్కలంగా ఉన్నాయి.

ఒక ప్రభుత్వ అధికారి రూ.2 కోట్ల లంచం మాట్లాడుకుని రూ.1.10 కోట్లు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి అంటున్నారు. యూత్ ఫర్ యాంటీ కరఫ్షన్ అధ్యక్షుడు పల్నాటి రాజేందర్, వరంగల్ కేంద్రంగా అవినీతి వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న జ్వాల సంస్థ అధ్యక్షుడు సుంకరి ప్రశాంత్ లు గిన్నీస్ బుక్ ప్రతినిధులతో టచ్ లో ఉన్నారు. కీసర తహసీల్దార్ బాలరాజు నాగరాజు పేరును గిన్నీస్ బుక్ లో చేర్చాలని ఆన్ లైన్ లో దరఖాస్తు కూడా చేశారు.

అయితే ప్రభుత్వ అధికారుల అవినీతికి సంబంధించి ఇంత వరకు ప్రత్యేక కేటగిరీ ఏమి లేదని, దాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నిస్తామని వారు హామీ ఇచ్చినట్లు ప్రశాంత్, రాజేందర్ లు తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like