* జయబచాన్ గారు నాపై కూడా కరుణ చూపండి.
పొలిటికల్ ఐ సెప్టెంబర్15 : బాలీవుడ్ చిత్ర పరిశ్రమ డ్రగ్స్ మత్తులో చిక్కిందంటూ తొలి రోజు పార్లమెంటు సమావేశంలో నటుడు ,ఎంపీ రవికిషన్ చెప్పడాన్ని రాజ్యసభ సభ్యురాలు , అలనాటి అందాల హీరోయిన్ ,నటి జయబచాన్ ఘాటుగా స్పందించారు. మంగళవారం నాడు రాజ్యసభ జీరో అవర్‌లో ఆమె ఎంపీ రవికిషన్ చేసిన వ్యాఖ్యల పై మండిపడ్డారు.సీనీ పరిశ్రమకు చెందిన వ్యక్తి అయి ఉండి కూడా పరిశ్రమకు వ్యతిరేకంగా మాట్లాడటం సిగ్గుచేటని ఆమె అన్నారు.ఎవరో కొద్ది మంది వ్యక్తుల కారణంగా మొత్తం బాలీవుడ్ పరిశ్రమ ప్రతిష్టను దిగజార్చకూడదు. మన సభ్యుల్లో ఒకరు, అది కూడా పరిశ్రమకు చెందిన వ్యక్తి సినీ పరిశ్రమకు వ్యతిరేకంగా సోమవారం లోక్‌సభలో మాట్లాడటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
ట్విట్టర్ లో జయబచాన్ కామెంట్స్ పై కంగనా కామెంట్స్
బాలీవుడ్‌ను కించపరిచేలా కుట్ర చేస్తున్నారంటూ జయబచ్చన్ వ్యాఖ్యలు చేయడానికి పార్లమెంట్ సభ్యుల, నటి జయాబచ్చన్ వ్యాఖ్యలపై కంగనా ట్విట్టర్ వేదికగా స్పందించారు. “జయాబచ్చన్గారు..నా స్థానంలో మీ కుమార్తె శ్వేతను టీనేజీలోని అవమానించి, కొట్టి, డ్రగ్స్‌కు బానిసను చేసుంటే ఇలాగే వ్యాఖ్యానిస్తారా? మీ కుమారుడు అభిషేక్ బచ్చన్ తనను బెదిరిస్తున్నారని చెప్పి ఓ రోజు ఉరి వేసుకుని వేలాడుతుంటే కూడా ఇలాగే మాట్లాడుతారా.. మాపై కూడా మీరు కరుణ చూపించండి” అని అన్నారు కంగనా.