Politicla Eye

చందమామ పెళ్లి పీటలు ఎక్కబోతుంది….

పొలిటికల్ ఐ: లక్ష్మి కల్యాణం మూవీతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టి తనదయిన నటన గ్లామర్ తో ఆకట్టుకున్న అమ్మడు త్వరలో పెళ్లి పీటలెక్కబోతుంది. ముంబై కి చెందిన ఇంటీరియర్ డిజైనర్ గౌతమ్ కిట్చలు తో తో కాజల్‌, వివాహం జరగబోతున్నట్లు టాక్‌. కాగా వ్యాపారవేత్తగా, ఇంటీరియర్‌ డిజైనర్‌గా గౌతమ్‌కి ముంబయిలో మంచి పేరు ఉంది. అయితే కాజల్ పెళ్లి విషయమై గతంలోనూ పలుమార్లు వార్తలు వచ్చాయి. వాటిని ఆమె ఖండిస్తూ వచ్చారు. ఇక గౌతమ్‌తో ఎంగేజ్‌మెంట్‌ జరిగినట్లు కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తుండగా.. వాటిపై ఆమె స్పందించకపోవడంతో ఈ పుకార్లకు ఆజ్యం పోసినట్లు అయ్యింది.

లక్ష్మీ కళ్యాణంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కాజల్ ఇప్పటివరకు తెలుగు, తమిళ్‌, హిందీలో దాదాపుగా 60 సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో పలు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. అందులో చిరంజీవి ఆచార్య, కమల్ హాసన్ ఇండియన్ 2లు భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నాయి. వీటితో పాటు విష్ణు మోసగాళ్లు, జాన్ అబ్రహాం ముంబయి సగ, దుల్కర్ సల్మాన్‌ హే సినామిక చిత్రాల్లోనూ ఆమె నటిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like