మహబూబ్ నగర్: ఎగువనుంచి భారీగా వస్తున్న వరదతో జూరాల 26 గేట్లను ఎత్తివేశారు.
ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2,15,000 క్యూసెక్కుల వరద వస్తోంది. కాగా దిగువకు 2,12,392 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 9.357 టీఎంసీల నీరు ఉంది.