చిత్తూరు: ఓ మంత్రి అండతో బి.కొత్తకోట తహశీల్దార్ తన కుటుంబాన్ని వేదింపులకు గురి చేస్తున్నారంటూ.. మదనపల్లె ఆర్డీవోకి ఫోన్ ద్వారా జడ్జి రామకృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జడ్జి రామకృష్ణ పలు ఆరోపణలు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలతో తహశీల్దార్ తనను రోడ్డుపైకి రాకుండా నిషేధాజ్ఞలు విధించినట్టు తెలిపారు. తహశీల్దార్ పాత డేట్ వేసి ప్రొసీడింగ్స్ ఇచ్చారని తెలపారు.
తన తమ్ముడు రామచంద్రపై అప్పటికే భూ వివాదానికి సంబంధించిన ఓ కేసు కోర్టులో నడుస్తుండగా.. కావాలనే మహిళను వేధించాడంటూ అక్రమంగా కేసు బనాయించారని ఆరోపించారు. తమపై అక్రమంగా కేసులు పెట్టాలనే ఉద్దేశంతో కోర్టులో సివిల్ కేసు నడుస్తున్నప్పుడు ప్రత్యర్థి వర్గం వారు వచ్చి వివాదాస్పద స్థలంలో దౌర్జన్యంగా రాళ్లు పాతుతున్నారని.. కేసుకు సహకరించకపోతే ఎన్కౌంటర్ చేస్తామని పోలీసులే బెదిరిస్తున్నారని రామకృష్ణ ఆరోపించారు.