ఢిల్లీ: జేఈఈ, నీట్ పరీక్షలకు షెడ్యూలు ప్రకటించడాన్ని కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ సమర్థించుకున్నారు. తల్లిదండ్రులు, విద్యార్థుల ఒత్తిడితోనే పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
ఇప్పటికే 80 శాతం మంది విద్యార్థులు అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకున్నారని రమేష్ పోక్రియాల్ వివరించారు. పరీక్షలు ఎందుకు నిర్వహించడం లేదని ఆందోళన చేస్తున్నారని, అందుకే షెడ్యూలు ప్రకటించామన్నారు. పరీక్షల కోసం ఎన్ని రోజులు ఎదురు చూడాలి, ఎన్ని రోజులు చదవాలంటూ వారు ప్రశ్నిస్తున్నారన్నారు.
జేఈఈ పరీక్షలకు 8.58 లక్షల మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 7.25 లక్షల మంది ఇప్పటికే అడ్మిట్ కార్డులు డౌన్ చేసుకున్నరని ఆయన తెలిపారు. దేశంలోని ఐఐటీ ల్లో ప్రవేశాల కోసం జేఈఈ, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్ నిర్వహిస్తున్నామన్నారు. జేఈఈ ప్రవేశ పరీక్షలు సెప్టెంబర్ 1 నుంచి, నీట్ ప్రవేశ పరీక్షలు 13 నుంచి ప్రారంభమవుతాయన్నారు.