హైదరాబాద్: జేఈఈ మెయిన్, నీట్ యూజీ పరీక్షల తేదీలు ఖరారైనట్టు ఎన్టీఏ ప్రకటించింది. సెప్టెంబర్ 01, 06 వ తేదీల్లో జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపింది.
సెప్టెంబర్ 13న నీట్ యూజీ పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపింది. జేఈఈ మెయిన్ పరీక్షా కేంద్రాల సంఖ్యను 570 నుంచి 660 కి పెంచుతున్నట్టు తెలిపింది. నీట్ యూజీ పరీక్షా కేంద్రాల సంఖ్య 2,546 నుంచి 3,843 కు పెంచనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.