హైదరాబాద్: మొబైల్ వినియోగదారులకు ఓ శుభవార్తను టెలీకాం సంస్థలు తెలపనున్నాయి. ఇకనుంచి ప్రిపెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్‌కు మారడం చాలా సులువు అవుతుంది. ఫామ్స్ నింపి, రోజుల తరబడి ఎదురు చూపులకు స్వస్తి పలకనున్నాయి.
ప్రీపెయిడ్ నుంచి పోస్ట్‌పెయిడ్‌కు కేవలం ఒక్క ఓటీపీతో సిమ్ మారేలా కొత్త గైడ్ లైన్స్‌ను టెలికాం డిపార్ట్మెంట్ రూపొందిస్తోంది. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత వినియోగదారులు సదరు కంపెనీ వెబ్సైట్లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ సౌకర్యం మరి కొన్ని రోజుల్లోనే అందుబాటులోకి రానుంది.