పొలిటికల్ ఐ: తెలంగాణ తల్లి ఫైర్ బ్రాండ్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ లోక్ సభ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి. రాములమ్మ కాంగ్రెస్ పార్టీ లొనే ఉన్నారా అనే గుసగుసలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.దీనికి కారణాలు ఏంటి లేడీ సూపర్ స్టార్ అప్పుడు అప్పుడు కాంగ్రెస్ లోక్ సభ ప్రచార కమిటీ చైర్మన్ పేరుతో స్టేట్మెంట్స్ ఇస్తూనే ఉన్నారు కదా ఇంకా ఏంటి అని ఆకునుంతున్నార.. మీరే చూడండి సాధారణంగానే విజయశాంతి గారు పార్టీ ఆఫీస్ కి రారు ,ప్రెస్ మీట్ లు పెట్టారు ,పార్టీ సమావేశంలో , నిరసన , ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారనే ప్రచారం ఉంది. ఇదంతా ఒకే ఇప్పుడేముంది తొందర ఎన్నికలు లేవు అనుకోవచ్చు కదా..! కానీ తెలంగాణ కు హై కమాండ్ ఇటీవలే కొత్త ఏఐసీసీ ఇన్ ఛార్జ్ ని నియమించింది.ఇటీవలే ఇంచార్జి తొలి సారి రాష్ట్రానికి వచ్చారు మూడు రోజులు వరుస సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ క్యాడర్ ని ఆక్టివ్ చేశారు.కానీ రాములమ్మ మాత్రం మూడురోజుల్లో ఒక్క రోజు కూడా వచ్చి ఫార్మాలిటీ గా కూడా ఇంచార్జి ని కలవలేదు. కోర్ కమిటీ లో విజయశాంతి మెంబెర్ కూడా అలాగే తర్వాత రోజు జరిగిన దుబ్బాక ఎన్నికల సమావేశానికి హాజరుకాలేదు. విజయశాంతి మెదక్ మాజీ ఎంపీ దింతో ఆ పార్లిమెంట్ పరిధిలోని నియోజకవర్గ సమావేశానికి రాలేదు. ఇక పార్టీ హై కమాండ్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లు కి వ్యతిరేకంగా పిలుపునిచ్చిన ఆఫీషియల్ కార్యక్రమంలో కూడా ఎక్కడా పాల్గొన్నలేదు.
దింతో రాములమ్మ అసలు పార్టీ లొనే ఉన్నారా అసలు ఉన్నారా అంటూ గుసగుసలాడుకుంటున్నారు. ఐతే రాములమ్మ పార్టీ పై ఏమైనా అలకబునిందా..! లేదా ఇంకేమైనా కొత్త అడుగు వేసే ఆలోచనలో ఉన్నరా అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.