Politicla Eye

గాంధీజి కలలు కన్న స్వరాజ్యం ఇదేనా…?

 

 

పొలిటికల్ ఐ అక్టోబర్ 02: ఈ రోజు గాంధీ జయంతి. గాంధీ జయంతికి ఈ రోజుతో 150 ఏళ్ళు. గాంధీ జయంతిని ప్రపంచ శాంతి దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. సత్యాగ్రహంతో అహింసా అనే ఆయుధాలతో స్వాతంత్రం సాధించుకోవచ్చు అని ప్రపంచానికి చాటి చెప్పాడు. గాంధీ నేర్పించిన మార్గదర్శకాలు ప్రపంచ దేశాల్లోని ఎన్నో క్లాస్ రూముల్లో పాఠాలుగా చెప్పబడుతున్నాయి.

గాంధీ నేర్పిన పాఠాలు ప్రపంచానికి దారి చూపిస్తున్నాయి కానీ బారతీయులమై ఉండి మనం గాంధీ అడుగు జాడల్లో నడవలేకపోతున్నాము. స్వతంత్రం వచ్చి 73 ఏళ్ళు అవుతున్న గాంధీజీ కలలు గన్న దేశం ఇంకా కల గానే ఉంది.

రామ రాజ్యం లాగా ప్రజలందరూ స్వేచ్ఛ స్వతంత్రాలతో సంతోషంతో ఉండాలనుకున్న గాంధీజీ ఇప్పుడున్న భారత దేశాన్ని చూస్తే నివ్వెరపోతారు. “అర్థరాత్రి ఆడది స్వేచ్ఛగా తిరినప్పుడే మనకి స్వాతంత్రం వచ్చిందన్నారు అర్థరాత్రి కాదు కదా పట్ట పగలు కూడా తిరిగే పరిస్థితి లేదు ఆడదానికి”.
జై జవాన్
జై కిసాన్ అన్న దాంట్లో జవాన్ పర దేశ కాల్పులకి బలి అవుతుంటే మన అన్నదాత పంటకు సరైన గిట్టుబాటు ధర లేక ఆకలి మంటలతో ఉరి పోసుకుంటున్నాడు.
రాజకీయ పార్టీలు కులాల పేరుతో మతాల పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతూ తమ ఉనికిని చాటుకుంటున్నాయి. ఈ రాజకీయ చదరంగంలో చదువు ఉన్నవాడు లేని వాడు అందరూ కీలు బొమ్మలే.

 


గాంధీ జయంతికి స్వచందంగా మాసం దుకాణాలు మద్యం దుకాణాలు మూసివేస్తున్నాం అనుకుంటున్నారు కానీ దొంగ దారిలో అన్నీ సాగుతూనే ఉన్నాయి.
ఏదయినా సాధించటానికి వాట్సాప్ స్టేటస్ లు పెడితేనో ట్విట్టర్ ట్రెండింగులు చేస్తేనో సరిపోతుంది అనుకుంటున్నారు ఇప్పటి యువత.. కానీ ఇవేవీ లేనప్పుడు యావత్ భారత దేశాన్ని ఒక్క తాటి పై నడిపించి బ్రిటీష్ పాలకుల నుండి భారత దేశానికి విమిక్తి కలిగించాడు మన బాపు. బాపు ని చూసి ఎన్నో నేర్చుకోవాలి మనం. ఇప్పటికైనా మన భారత దేశాన్ని మనమే కాపాడుకుందాం.

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like