Politicla Eye

మజ్లీస్ పార్టీ కి మాజీ ప్రధాని పీవీ నర్సింహ రావు అంటే కోపమా…?

మజ్లీస్ అసెంబ్లీకి రాకపోవడం అధికారపార్టీ వ్యూహమేనా…?

* మాజీ ప్రధాని పీవీ నర్సింహ రావు పై మజ్లీస్ కి కోపం ఉందా…!

* పీవీ కి భారతరత్న ఇవ్వడం మజ్లీస్ కి ఇష్టం లేదా..?

* ఇది గమనించిన అధికార పార్టీ వ్యూహంతోనే మజ్లీస్ ని అసెంబ్లీ కి రానివ్వకుండ చేసిందా…?

* టీఆరెస్ మిత్రపక్షమైన ఎంఐఎం ఎందుకు పీవీ తీర్మాన సభకు రాలేదు…టీ కాంగ్రెస్

పొలిటికల్ ఐ సెప్టెంబర్ 8 : తెలంగాణలో అధికార టీఆరెస్ పార్టీ టిఆర్ఎస్ తన మిత్రపక్షపార్టీ మజ్లీస్ ని కూడ తన వ్యూహాలతో నడిపిస్తోందనే చర్చజోరుగా అసెంబ్లీ లో జోరుగా సాగుతోంది. దీని కారణం అసెంబ్లీ లో పీవీ కి భారతరత్న ఇవ్వాలని చేసిన తీర్మాన సభలో ఎంఐఎం పాల్గొనకపోవడమే..ఎంఐఎం సభకు రాకపోవడంతో ఇటు ప్రతిపక్షాలు సైతం పీవీ కి భారతరత్న ఇవ్వాలనే తీర్మానం చేస్తున్న సమయంలో అధికార పార్టీ కి మిత్రపక్షంగా ఉంటున్న ఎంఐఎం ఎందుకు రాలేదనే ప్రశ్న లెవనెత్తింది.ఇక ఇటీవల సచివాలయంలో ఆలయం కూల్చివేత పై బిజేపి ఆగ్రహంతో ఊగిపోయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేసంది. కానీ సచివాలయంలో మజీద్ కూల్చివేసి మజ్లీస్ పార్టీ కింమనకుండా సైలెంటుగా కూర్చొంది. రోడ్ల పై ఎక్కడ ఏ చిన్న దర్ఘాను కదిలించినా గడగడలాడించే మజ్లీస్ పార్టీ సచివాలయంలో ఏకంగా ప్రభుత్వం మజీద్ ను కూల్చిన సైలెంటును మైయింటైన్ చేసింది. అయితే ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ ఇచ్చే వరకు ఎదరు చూసి సీఎం అపాయింట్ మెంట్ ఇచ్చిన తరువాత మత పెద్దలతో భేటి నిర్వహించి సామరస్యంగా సమస్యకు పరిష్కరించుకునే ప్రయత్నం మజ్లీస్ పార్ట్ చేసిందనే వాదన కూడా ఉంది. దీంతో టిఆర్ఎస్ – మజ్లీస్ పార్టీ వ్యూహాన్ని పరోక్షంగా టిఆర్ఎస్ పార్టీ అమలు చేస్తోందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇక అసెంబ్లీలో సైతం అదే వ్యూహం కనిపించిందనే చర్చ రాజకీయాల్లో నడుస్తోంది. తాజగా తెలంగాణ అసెంబ్లీల్లో మాజి ప్రధాని విపి నరసింహ రావు కి భారతరత్న ఇవ్వాలనే తీర్మాణాన్నిసొంత విపక్షపార్టీ మజ్లీస్ డుమ్మాకొట్టింది. ఈ డుమ్మా వెనుక అధికార టిఆర్ఎస్ పార్టీ వ్యూహామే ఉండిఉండవచ్చు అనే చర్చ కూడ రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతోంది. మజ్లీస్ పార్టీ పీసికి భారతరత్న ఇవ్వాలని తీర్మాణం లో మజ్లీస్ పాల్గొని వ్యతిరేకిస్తున్నట్లు సభలో చెప్పే అవకాశం ఉండడంతో అది కాంగ్రెస్ కు అడ్వాటేజ్ అవుతుందని భావించి గులాబి పార్టీ వ్యూహాత్మకంగా మజ్లీస్ ను డుమ్మాకొట్టించిందనే చర్చ కొనసాగుతోంది.ఒక వేళ సభకు మజ్లీస్ హాజరై పీవికి వ్యతిరేకంగా మాట్లాడితే.. కాంగ్రెస్ గగ్గోలు పెట్టే అవకాశం ఉంది కాబట్టి మజ్లీస్ ను సైలెంటుగా సైడ్ కావాలని గులాబి పార్టీ చెప్పినట్లు అసెంంబ్లీలో చర్చ జరుగుతోంది. మజ్లీస్ పార్టీకి ముందు నుండి పీవి అంటే కోపం. ఆ కోపంతోనే…. ఆయనకు భారతరత్న తీర్మాణానాకికి డుమ్మాకొట్టినా సభకు హాజరై అదే విషయాన్ని సభలో చెప్పిఉంటే మజ్లీస్ వ్యతిరేకించిందని కూడ ఓ వర్గం ప్రజలకు తెలిసేది.కాని ఏకంగా సభకు గైరాహర్హరు కావాలని టిఆర్ఎస్ పార్టీ వ్యూహాం ప్రకారమే మజ్లీస్ డుమ్మాకొట్టిందని చర్చించుకుంటున్నారు.అయితే టిఆర్ఎస్ పార్టీ మజ్లీస్ పార్టీ వ్యూహాన్ని సైతం టిఆర్ఎస్ పార్టీ నడుపుతోంది. కాని మజ్లీస్ తనకు కలిసి వచ్చే అంశాలకు తప్పా మిగతా అంశాలాల్లో ఎవరి మాట వినదు. కానీ అసెంబ్లీ వ్యూహా్ని కూడ టిఆర్ఎస్ అమలు చేయడం వెనుక గ్రేటర్ ఎన్నిలకనే వాదన కూడ ఉంది.మరి టిఆర్ఎస్ భవిస్తున్నట్లుగా  మజ్లీస్ అంశం ఎంతవరకు మేలు చేస్తుందో చూడాలి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like