పొలిటికల్ ఐ సెప్టెంబర్ 14: చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి రేఖ. తన వ్యక్తిగత విషయం లో కూడా సరిగ్గా 30ఏళ్ళ క్రితం ఇప్పుడు రియా విషయంలో జరుగుతున్నట్టే జరిగింది. వ్యాపారవేత్త అయిన ముఖేష్ ని పెళ్లి చేసుకుంది. పెళ్లయిన 7నెలలకే రేఖ చున్నీతో, ఉరి వేసుకొని చనిపోయాడు. తన భర్త చావుకు రేఖనే కారణం అని తనని, హాంతకురాలు, వేశ్య అంటూ మీడియా ప్రచురణ చేసింది పబ్లిక్ కూడా అలానే నిందించారు. కానీ అసలు నిజం ఏంటి అనేది ఎవరికి తెలీదు. సరిగ్గా ఇప్పుడు రియా విషయం లో కూడా అదే జరుగుతోంది సుశాంత్ చావు కి కారణం రియా అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ పెరిగాయి. కానీ అసలు నిజం పోలీస్ విచారణలో తేలనుంది.
రియాకు పెరుగుతున్న సానుభూతి..
ఇదిలా ఉండగా బాలీవుడ్ వర్గాల నుండి రియకు మద్దతు లభిస్తుంది. కానీ సుశాంత్ మరణించిన 3 నెలల తర్వాత రియకు ఇప్పుడు మద్దతు ప్రకటించడానికి కారణం, కేవలం డ్రగ్స్ విషయంలో బడా బాబుల పేర్లు బయట పెడుతుందేమో అన్న భయంతోనే ఇప్పుడు అందరూ మద్దతు ఇస్తున్నారా?
ఏదేమైనా అసలు నిజాలు ఏంటి అన్నది పోలీస్ విచారణలో బయటకు రావాల్సి ఉంది.