పొలిటికల్ ఐ సెప్టెంబర్ 19 : లక్ లేకపోవటం ఏంటి కప్ గెలవటానికి కావాల్సింది మంచి ప్లేయర్స్ కదా అనుకుంటున్నారా, కానీ ఆ టీం లో ప్లేయర్స్ కి టాలెంట్ కి కొదువ లేదు అయినా ఆ అదృష్టం ఆ టీం ని వరించలేదు ఆ టీమ్ రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు. ఆ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత్ కి ఎన్నో అద్భుతమైన విజయాల్ని అందించాడు కానీ బెంగుళూరు కి కప్ అందించలేకపోతున్నాడు. ఒకసారి బ్యాటింగ్ విఫలం మరొకసారి బౌలింగ్ విఫలం.

కోహ్లీ కి ఐపీఎల్ లో మంచి రికార్డు ఉంది, ఇప్పటివరకు 973 పరుగులు కూడా చేసాడు కానీ టైటిల్ గెల్చుకోవటానికి ఆ పరుగులు ఉపయోగ పడలేదు. ఏ సంవత్సరం ఈ స్థానం లో ఉంటుందో తెలీదు. 2016 లో రన్నరప్ గ నిలిచినా జట్టు 2017 లో పాయింట్ల పట్టికలో చివరి స్థానం లోకి వెళ్ళింది.ఇంకో విశేషం ఏంటంటే అద్భుతమైన రికార్డు చెత్త రికార్డు రెండు ఈ జట్టు పైనే ఉన్నాయి. పూణే వారియర్స్ ఫై 2013 లో 5 వికెట్లకి గని 263 పరుగులు చేసింది. 2017 లో కోలకతా నైట్ రైడర్స్ ఫై 43 పరుగులకే అల్ అవుట్. ఈ రెండు రికార్డు లు ఇప్పటికి ఎవరు బ్రేక్ చేయలేదు. ఈసారి మాత్రం కప్పు కొట్టడం గారంటీ అనే ధీమాతో ఉన్నారు .ఎందుకంటే టీం లో చాల మార్పులు చేర్పులు చేసి కొత్త వ్యూహాలతో ముందుకు రానున్నట్లు తెలుస్తోంది . చూద్దాం ఈసరైన అదృష్టం వహిస్తుందో లేదా మరోసారి ఫాన్స్ అంచనాలను తారుమారు చేసి నిరాశే మిగిలిస్తుందో లెట్స్ సి ..