అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది.
గడిచిన 24 గంటల్లోనే రాష్ట్రంలో కరోనాతో 92 మంది మృత్యువాత పడ్డారు. ఇదే సమయంలో కొత్తగా 9,927 మంది కరోనా బారిన పడ్డారు.
తాజా కొత్త కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 3,71,639 కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 3,460 కి చేరింది. ఇప్పటి వరకు 2,78,247 మంది కరోనా బారినుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 89,932 యాక్టీవ్ కేసులున్నాయి.