Politicla Eye

తెలంగాణ వ్యాప్తంగా అన్ని రేగిస్ట్రేషన్లకు స్టాప్ సిగ్నల్ ఇచ్చిన సర్కార్

బిగ్ బ్రేకింగ్ తెలంగాణ వ్యాప్తంగా అన్ని రిజిస్ట్రేషన్ల లకు స్టాప్ సిగ్నల్ ఇచ్చిన సర్కార్

పొలిటికల్ ఐ: తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 8 వ తేదీ నుండి అన్ని రకాల రిజిస్ట్రేషన్స్ నిలిపివేయాలని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి
ఈ నెల 7 వ తేదీ నుంచి ఈ-స్టాంపుల విక్రయాన్ని అధికారులు నిలిపివేశారు. ఇప్పటికే చలానాలు చెల్లించిన వారికి ఈ నెల7 వతేది ఒక్కరోజు రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు అవకాశమిచ్చారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్‌శాఖ ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలోనే రిజిస్ట్రేషన్లను నిలుపుదల చేసినట్లు తెలుస్తోంది. నూతన రెవెన్యూ చట్టం ఆధారంగా రాబోయే రోజుల్లో ఎమ్మార్వోల పరిధిలో రిజిస్ట్రేషన్లు చేయించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని కొందరు సీనియర్‌ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. అయితే తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like