తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఉపాధి కోల్పోయింది..కేటీఆర్
గాంధీభవన్ కి త్వరలో టులెట్ బోర్డ్ పెట్టుకునే పరిస్థితి వచ్చింది..కేటీఆర్
పొలిటికల్ ఐ సెప్టెంబర్ 16 : కాంగ్రెస్ పార్టీ పై తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ & ఐటీ శాఖ మిస్టర్ కేటీఆర్ సభలో విమర్శల జల్లు కురిపించారు. హైదరాబాద్ అభివృద్ధి పై సభ లో చర్చ సందర్భంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి గురించి టీఆరెస్ వచ్చిన తర్వాత ఉపాధి లేదని ,నిరుద్యోగం పెరిగిందని ప్రసంగించారు.అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ….తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉపాధి లేదు అన్నది నిజం కానీ అది కాంగ్రెస్ పార్టీ తన ఉపాధి కోల్పోయిందని , కాంగ్రెస్ పార్టీ దుకాణం రాష్ట్రం లో బంద్ అయిందని సెటైర్ వేశారు.త్వరలో గాంధీభవన్ కి టులెట్ బోర్డ్ పెట్టుకునే పరిస్థితి వచ్చిందని విమర్శించారు.మన రాజధాని ఇంత అభివృద్ధి జరుగుతుంటే ఎందుకు కడుపుమంటో అర్ధంకావడం లేదన్నారు.