ముంబై: కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ పై అన్నీ చెబుతాం. మరో అరవై రోజులు ఓపిక పడితే బాగుంటుందని మీడియా సంస్థలను సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధర్ పునావల్లా ట్వీట్ చేశారు.
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనికా సంయుక్త ఆధ్వర్యంలో వ్యాక్సిన్ అభివృద్ధి పరుస్తున్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్ తయారీకి సీరం ఒప్పందం కుదుర్చుకున్నది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ ఇండియాలో రెండు దశల క్లినికల్ ప్రయోగాలను పూర్తి చేసుకున్నది. ప్రస్తుతం మూడో దశ ప్రయోగాలు మొదలయ్యాయి.
కోవిషీల్డ్ క్లినికల్ ట్రయల్స్ పై రోగుల గురించి పూర్తిగా వివరాలు రాకముందే ఎలాంటి వార్తలు ఇవ్వొద్దని మీడియాను కోరారు. ఈ ప్రక్రియను అందరూ గౌరవించాలని, లక్ష్యాన్ని పక్కదారి పట్టించవద్దని అధర్ కోరారు.
I would kindly request the media to refrain, from reporting on interim data coming in about patients on the SII – Covishield clinical trials. Let us not bias the process. Let us respect the process and stay patient for two months, all the relevant data will be published soon.
— Adar Poonawalla (@adarpoonawalla) August 27, 2020