Politicla Eye

ఎవరైనా ప్రపోజ్ చేస్తే పెళ్లి గురించి ఆలోచిస్తా..దేవి నాగవళ్లి

పొలిటికల్ ఐ అక్టోబర్ 01:పెళ్లి గురించి దేవి నాగవళ్లి తన అభిప్రాయాన్ని ఒక ఇంటర్వ్యూ లో ఇలా చెప్పుకొచ్చింది.నేను వ్యక్తిగతంగా స్ట్రాంగ్ అయినప్పటికీ దాంపత్య జీవితంలో ఫెయిల్‌ కావడం వెనుక మరే కారణం లేదని అన్నారు. ఉద్యోగం లేకుండా ఇంట్లో ఖాళీగా ఉండలేక పోయానని నా ప్రొఫెషన్‌ను కొనసాగించాలని అనుకొన్నాను. ఇంట్లో నా నిర్ణయాన్ని చెబితే కొన్నాళ్లు చర్చలు జరిగాయి.తర్వాత ఎలాంటి గొడవలు, విభేదాలు లేకుండా మేము విడిపోయాం. ఇద్దరు మంచి వాళ్లు కలిసి ఉంటారని చెప్పలేం దేవీ నాగవళ్లీ తెలిపారు.మ్యారేజ్ బ్రేకప్ జరగడం వల్ల బాధలేదు. నా జీవితంలో జరిగాల్సింది జరిగిపోయింది. నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. బిగ్‌బాస్‌లో నేనంటే ఏమిటో తెలిసిన తర్వాత నాకు ఎవరైనా ప్రపోజ్ చేస్తే ఆలోచిస్తాను. పెళ్లి చేసుకోకూడదనే ఆలోచనలేదు. పెళ్లి చేసుకోవడం తప్పు అని భావించడం లేదు. నా కొడుకు కార్తీకేయ గురించి నా ఆలోచనలు ఉన్నాయి. కార్తీకేయ ఎలా అర్ధం చేసుకొంటాడు అనే విషయంపై నా ఆలోచన అంతా అని దేవీ నాగవళ్లీ అన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like