మీడియా కు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు…ఎమ్మెల్యే జగ్గారెడ్డి
* టీఆరెస్ మీడియా గొంతు నొక్కుతుంది..
* తెలంగాణ ఉద్యమంలో ,ఇప్పుడు మీడియాకు అమరవీరుల స్థూపమే వేదికైంది.
* ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ 25 ఏళ్లుగా పోరాడుతున్నారు.
* వర్గీకరణ సుప్రీం కోర్టు రాష్ట్రాల పరిధిలోనే ఉందని చెప్పింది..
* రాష్ట్ర సర్కారు అసెంబ్లీ లో వర్గీకరణ పై తీర్మానం చేసింది..
* సుప్రీం తీర్పు నేపథ్యంలో సర్కార్ ఎస్సీ వర్గీకరణ చేయాలని అసెంబ్లీ లో ప్రశ్నిస్తా..
పొలిటికల్ ఐ : కరోనా పేరు తో అసెంబ్లీ లో మీడియా పై ఆంక్షలు పెట్టడం సరైంది కాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.సోమవారం అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద మీడియా తో మాట్లాడుతూ….టిఆర్ఎస్ మీడియా గొంతు నొక్కుతుందని మీడియా కు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఉధ్యమంలో ఎప్పుడు అనుకోలేదని అన్నారు. తెలంగాణ ఉధ్యమంలో అమరవీరుల స్తూపమే మీడియా వేధిక అయింది తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అదే అమరవీరుల స్తూపం వేధికైందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం మంద కృష్ణ మాధిగ 25 సంవంత్సరాలుగా పోరాడుతున్నారని అన్ని పార్టీ లు వివిధ సంధర్భాలలో మద్దతు ఇచ్చాయని గుర్తు చేశారు.ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాల పరిధిలోని అంశమని చెప్పింది. ఇక గత అసెంబ్లీ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ పై తీర్మానం చేసిన తర్వాత కూడా ఏంధుకు ఆలస్యం అవుతుందని ప్రశ్నించారు.ఈ సమావేశాలలో సమావేశంలో వర్గీకరణ అమలు చేయాలి డిమాండ్ చేస్తానని ఈ అంశాన్ని అసెంబ్లీ లో ప్రస్తావిస్తామని తెలిపారు.