చెన్నై: భార్యాభర్తల వార్షిక వేతనం అక్షరాలా రూ.175 కోట్లు. వారెవరో కాదు సన్ నెట్ ప్రమోటర్లు కళానిధి మారన్, ఆయన భార్య కావేరీ మారన్. ఇండియా కార్పొరేట్ రంగంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ఎగ్జిక్యూటివ్ లుగా ప్రథమ స్థానంలో నిలిచారు.
గత ఏడాది వీరిద్దరు కలిసి తీసుకున్న వేతనం రూ.175 కోట్లు అని స్టాక్ ఎక్చేంజీలకు సన్ టీవీ బుధవారం వార్షిక నివేదికను సమర్పించింది. 1993 సంవత్సరంలో కళానిధి మారన్ సన్ నెట్ ను స్థాపించాడు. అయన ఎగ్జిక్యుటివ్ చైర్మన్ గా ఉండగా, ఆయన భార్య ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఒక్కొక్కరు రూ.13.87 కోట్లు చొప్పున వేతనం, మరో రూ.73.63 కోట్లు చొప్పున బోనస్ తీసుకున్నారు. ఈ రెంటిని కలిపితే ఒక్కొక్కరి వేతనం రూ.87.50 కోట్లు అవుతుంది.