తిరుపతి: సినిమా యాక్షన్ సీనును తలపించే విధంగా భారీ దోపిడి జరిగింది. తమిళనాడు- ఆంధ్రా బార్డర్ నగరి వద్ద ఘటన చోటు చేసుకున్నది. ఒక లారీ ఫుల్ లోడుతో వెళ్తుండగా మరో లారీ అడ్డగించి అందులో ఉన్న మొబైల్ ఫోన్స్ చోరీ చేశారు.
మంగళవారం రాత్రి తమిళనాడు పెరంబుదూర్ నుంచి ముంబై వెళ్తున్న లారీని నగరి సమీపంలో మరో లారీని పెట్టి డ్రైవర్ ను చితకబాదారు. ఆ తరువాత సుమారు రూ.6 కోట్ల విలువ చేసే మొబైల్ ఫోన్లు దొంగలు దోచుకున్నారు. లారీలో మొత్తం 16 బాక్సులు ఉండగా 8 బాక్సులలో ఉన్న మొబైల్ ఫోన్లను అపహరించారు. లారీలో ఉన్న స్టాక్ ను మరో లారీలోకి ఎక్కించి, కంపెనీ లారీని పుత్తూరులో వదిలి వెళ్ళారు. మొత్తం రూ.12 కోట్ల విలువ చేసే ఫోన్లను తరలిస్తున్నారు. లారీ డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు.