హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీ నేత గులాంనబీ అజాద్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు తీవ్రంగా స్పందించారు.
ఇందిరాగాంధీ లేకపోతే నీవు ఎలా వచ్చేవాడివంటూ.. ప్రశ్నించారు. గత 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ దయ వల్లే గులాంనబీ ఆజాద్ ఏదో ఒక పదవిలో ఉంటున్నావని అన్నారు. పార్టీ కష్టకాలంలో ఆజాద్ వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు.