డెహ్రాడూన్: ఎప్పటి మాదిరే రైతులు తమ పొలంలో పని చేసుకుంటన్నారు. వారికి రెండు కొండ చిలువలు కనబడడంతో భయాందోళనకు గురయ్యారు. అంతలోనే తేరుకుని గ్రామ పెద్దకు సమాచారం ఇవ్వగా, ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అటవీ శాఖ క్విక్ రెస్సాన్స్ టీమ్ హల్ద్వాని లోని గౌలపర్ గ్రామానికి చేరుకున్నారు. పొలంలో ఒకటి పది అడుగుల పొడవు ఉండగా, మరొకటి పన్నెండు పొడవు ఉంది. వీటిని పట్టుకునే సమయంలో అటవీ అధికారులు వీడియో తీశారు. ఒక కొండ చిలువ ను బంధించే క్రమంలో అది సిబ్బంది కాలను చుట్టుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.