Politicla Eye

డ్రగ్స్ హీరోయిన్లు మాత్రమే వాడతారా…! హీరోలు?

పొలిటికల్ ఐ సెప్టెంబర్24 2020: సుశాంత్ సింగ్ మరణం వెనకాల దాక్కున్న డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చింది. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా ని డ్రగ్స్ కేస్ లో సెప్టెంబర్ 3వ తేదీన అరెస్ట్ చేశారు బెయిల్ కి అప్లై చేసినప్పటికీ కోర్ట్ తిరస్కరించింది. కేస్ విచారణ జరుగుతుంది. విచారణలో అసలు నిజాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. డ్రగ్స్ రకుల్, సారా అలీ ఖాన్ తీసుకున్నట్టు విచారణలో తెలిసింది.వీరు మాత్రమే కాకుండా శ్రద్ద కపూర్ దీపికా పదుకొనె పేర్లు కూడా బయటకు వచ్చాయి. వీరి నలుగురికి కలిపి ఎన్సీబీ సమన్లు జారీ చేసింది.
వీరు మాత్రమే కాకుండా నమ్రత దియా మీర్జా పేర్లు కూడా బయటకు వచ్చినప్పట్టికి అవన్నీ వట్టి పుకార్లే అని తేలిపోయింది. కానీ ఇంత పెద్ద సినీ ఇండస్ట్రీ లో బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ చాలా ఇండస్ట్రీ లు ఉన్నప్పటికి నటులుగా ప్రొడ్యూసర్లుగా డైరెక్టర్లుగా చెలామణీ అవుతున్న మగ మహారాజులు డ్రగ్స్ సరఫరాలో గాని తీసుకోవటం లో గాని వీరి పాత్ర ఏ మాత్రం లేదా ఎందుకని కేవలం నటిమనుల పేర్లు మాత్రమే బయటకు వస్తున్నాయి అన్న అనుమానం సామాన్య ప్రజల్లో కలుగుతుంది. సామాన్య ప్రజల మెదడులో మెలుగుతున్న అనుమానం ఎంత వరకు నిజం అన్నది కాలమే నిర్ణయిస్తుంది. ఈ విచారణలో ఇంకా ఎవరి పేర్లు బయటకి రానున్నాయో వేచి చూడాలి!

Get real time updates directly on you device, subscribe now.

You might also like