Politicla Eye

డబ్బు ముందు కూతురు ఓడిందా…!

పొలిటికల్ ఐ సెప్టెంబర్ 25 2020: హైదరాబాద్ లో మరో పరువు హత్య.చందనగర్ కి చెందిన హేమంత్, అవంతి నాలుగు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు..ఐతే అవంతి కుటుంబ సభ్యులు అందరూ కలిసి కిడ్నప్ చేయించి హత్య చేయించారని తెలుస్తోంది.హేమంత్ ,అవంతి 8 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇంట్లో వారి పెళ్లి చేసేందుకు ఒప్పుకోలేదు దీనితో ఇద్దరు వివాహం చేసుకున్నారు…

 

సెప్టెంబర్ 24 న సాయంత్రం 4 గంటలకు ఇంటికి వచ్చి కారు లో తీసుకెళ్ళారు. దింతో హేమంత్ తండ్రి, హేమంత్ భార్య అవంతి 100 కి డయల్ చేసి కంప్లైంట్ ఇచ్చారు.అప్పటి నుండి పోలీసులు వెతుకుతూ వచ్చారు.కానీ సెప్టెంబర్ 25 న ఉదయం సంగారెడ్డి లో సూపరి తీసుకున్న కిరాయి గుండాలు హత్య చేసి బాడీ పడేసి వదిలేశారు.

హేమంత్ ని చంపిన ఏ ఒక్కరిని వదలొద్దు హేమంత్ భార్య అవంతి

మా మేనమామ యుగేందర్ రెడ్డి నా భర్త హేమంత్ ని ఎత్తుకెళ్ళారు. ఇష్టం లేకపోతే చంపేస్తారా..! డబ్బు లేకున్న మేము సంతోషంగా ఉన్నాము.ప్రణయ్ ని చంపిన మారుతిరావు గతి ఏమైంది..దీంట్లో మా కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు హేమంత్ ని చంపిన ఏ ఒక్కరిని వదలొద్దు అంటూ అవంతి ఆవేదన తో ఉంది.ఇలాంటి పరిస్థితి ఎవరైనా కోరుకుంటారా… ఇప్పుడు కుటుంబ సభ్యులు అందరూ జైల్ లో ఉన్నారు నేను చేసుకున్న భర్త చనిపోయాడు.డబ్బులు లేకపోతే చంపేస్తారా..!కొట్టి వదిలేస్తారేమో అనుకున్న చేతులు,కళ్లు విరిచేసి వదిలేస్తారేమో అనుకున్న అయినా సరే నేను అతని కారెక్టర్ చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్న కదా సంతోషంగా ఉద్యోగం చేసుకొని జీవించే వాడిని ఇలా చేసిన, ఎవరికైనా శిక్ష పడాల్సిందే…

Get real time updates directly on you device, subscribe now.

You might also like