పొలిటికల్ ఐ: బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. 72 గంటల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చిరించింది. నిన్న ఒక్కరోజే హైదరాబాద్ లో 20 నుండి 30 సెంటీమీటర్ ల వర్షం పడింది. 6/7 సెం. మి వర్షం పడితేనే హైదరాబాద్ అతలాకుతలం అవుద్ధి. అలాంటిది ఇంత భారీ వర్షాలతో 100 ఏళ్లలో ఇంత భారీ వర్షం నగరంలో కురవలేదని చెప్తున్నారు.
లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయాయి హైదరాబాద్ మొత్తంలో 1500 కాలనీలు నీట మునిగాయి. ఇప్పటికే హైదరాబాద్ వరంగల్ హైవే మరియు హైదరాబాద్ విజయవాడ హైవే క్లోజ్ చేశారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో ప్రైవేటు ఆఫీసులకు ఇవ్వాళ సెలవు ప్రకటించారు. కేటీఆర్ కూడా రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ అధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వత్సహం ఇలాగే ఇంకో 2 రోజులు కొనసాగితే హైదరాబాద్ నగరం పూర్తిగా మునిగిపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు కూడా అత్యవసరం ఐతే తప్ప బయటకు వెల్లకపోవటం మంచిది.