నల్లగొండ: గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో నాగార్జున సాగర్ కు భారీగా వరద వస్తోంది. వరద భారీగా వస్తుండడంతో 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 590 అడుగుల మట్టానికి నీరు చేరింది. ఇప్పటికే కృష్ణా, గోదావరి నదులపై ఉన్న దాదాపు అన్ని ప్రాజెక్టులూ పూర్తిగా నిండిపోయాయి.