చెన్నై: నటి, బిగ్ బాస్ ఫేమ్ వనితా విజయ్ కుమార్ భర్త పీటర్ పాల్ కు గుండె పోటు వచ్చింది. మంగళవారం సాయంత్రం గుండెపోటు రాగా వెంటనే హాస్పిటల్ కు తరలించారు.
ఛాతిలో నొప్పి వస్తుందని తెలియచేయడంతో ఒక ప్రైవేటు హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. అతన్ని పరీక్షించిన వైద్యులు గుండెపోటుగా నిర్థారించి, చికిత్స ప్రారంభించారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని భార్య వనితా ప్రకటించారు.
వనితా ఇటీలే పీటర పాల్ ను మూడో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వివాహం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే