గుంటూరు: గుట్కా డాన్ కామేశ్వరరావు ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే కామేశ్వరరావు పై పెద్ద ఎత్తున గుట్కా అక్రమ రవాణా కేసులు నమోదు అయి ఉన్నాయి.
ఇటీవలే గుట్కా మాఫియా ఆదిపత్య పోరులో ఒక ఎమ్మెల్యే లీజుకు ఇచ్చిన గొడౌన్ పై దాడి చేసి గుట్కా తయారీ కేంద్రాన్ని పోలీసులు సీజ్ చేశారు. పోలీసులకు కలసి వస్తున్నా,గుట్కా వ్యాపారంలో ఆదిపత్యపోరు మొదలైంది. ఒకరి పై ఒకరు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో గుట్కా డాన్ దందా బట్టబయలు అయింది.