- * ఎల్ ఆర్ఎస్ 131 జీవో ని రద్దు చేసి ప్లాట్ లు ఉచితంగా రేగులరైజ్ చేయాలి..జగ్గారెడ్డి
* కరవు కాలం లో పేద ప్రజలను ఆదుకోవాలి..
* ఇది ప్రభుత్వ బాధ్యత….
పొలిటికల్ ఐ సెప్టెంబర్ 11: L R S పై అసెంబ్లీ లో ప్రస్తావిస్తానని ఎమ్మెల్యే జగ్గారెడీ అన్నారు.ఎల్ ఆర్ ఎస్ కట్టి రెగ్యులరైజ్ చేసుకోండి అని ప్రభుత్వం చెప్తుంది కానీ 200 గజాల ప్లాట్ కి 40 వేల ఖర్చు అవుతుందని లే అవుట్ చేసిన వాళ్ళు LRS కట్టకపోవడం తో ఇప్పుడు భారం అంతా కొన్నవాళ్లదే అవుతుందని ,లే అవుట్ల కు ప్రభుత్వం తొందరగా అనుమతులు ఇవ్వడం లేదని తెలిపారు.నగదు రద్దు gst, ఇప్పుడు కరోనా తో జనం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని ప్రభుత్వం కి డబ్బులు కావాలంటే… పేదలపై భారం మోపాలా..? అని ప్రశ్నించారు. ప్రజలు కరువులో ఉన్నారని LRS కడితేనే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పడం సరికాదని అన్నారు.